స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'.(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -231 లో...కార్తీక్, దీప కలిసి ఇంటికి వస్తారు. అనసూయ క్యారేజ్ చూసేసరికి అది బరువుగా ఉంటుంది. దాంతో వీళ్ళు భోజనం చెయ్యాలేదు.. ఏం జరిగిందని అనసూయ, కాంచన ఇద్దరు దీపని అడుగుతారు. నన్నేం అడగకండి అంటూ దీప లోపలికి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్తీక్ ని కంపెనీ నుండి తీసేయ్యడమేంటని దశరత్ తో మాట్లాడుతుంది సుమిత్ర. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. వాడు పోతే నష్టమేంటి అన్నట్లు మాట్లాడుతాడు. అప్పుడే జ్యోత్స్న కూడా వస్తుంది. బావ వెళ్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావని జ్యోత్స్నతో సుమిత్ర అనగా.. వాడు తగ్గాలా నేను తగ్గాలా అని శివన్నారాయణ అంటాడు. వాడు పోతే ఇంకా దొరకరా ఏంటని పారిజాతం అనగానే.. దొరకరు పిన్ని వాడు చాలా టాలెంటెడ్.. వాడు సీఈఓ అయినప్పటి నుండి మరిన్ని లాభాలు వచ్చాయని దశరథ్ అంటాడు. ఇంకా వాడి గురించి ఆపు.. మనమందరం ఉన్నాం.. వాడేం చేసిన శివన్నారాయణని మాత్రం ఢీ కొట్టలేడని శివన్నారాయణ అంటాడు.
ఆ తర్వాత కార్తీక్ కి దీప కాఫీ తీసుకొని వస్తుంది. ఇద్దరు కాఫీని షేర్ చేసుకుంటారు. అప్పుడే అనసూయ, కాంచన ఇద్దరు వస్తారు. అసలేం జరిగిందని కాంచన అడుగగా.. నా నోటితో నేను కంపెనీ నుండి వెళ్లిపోయేలా చేశారు.. అవమానించాడు.. అందుకే రాజీనామా చేసి వచ్చానని అనగానే.. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కాంచన బాధపడుతుంది. నన్ను జీరోకి తీసుకొని వచ్చానని వాళ్లు అనుకుంటున్నారు కానీ ఇక్కడి నుండి మొదలుపెడతానని వాళ్లకు తెలియదు.. ఇది ముగింపు కాదూ ఆరంభమని కార్తీక్ అంటాడు..
ఆ తర్వాత కార్తీక్ ని జాబ్ నుండి తీసేసిన విషయం శ్రీధర్ కి కావేరి చెప్పగానే.. బాగా అయింది అంటూ శ్రీధర్ సంతోషపడుతూ స్వీట్ తీసుకొని రమ్మంటాడు. దాంతో కావేరి మిరపకాయ తీసుకొని వచ్చి శ్రీధర్ నోట్లో పెడుతుంది. వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చెయ్యాలని కావేరి అనుకుంటుంది. మరొకవైపు స్వప్న, కాశీ, దాస్ లు కార్తీక్ ఇంటికి వస్తారు. అన్నయ్య మేము ఫుడ్ కోర్ట్ పెడుదామనుకున్నాం కానీ అది ఇప్పుడు మీకు అవసరం రెస్టారెంట్ పెట్టండి అని కార్తీక్ కి సలహా ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.